రేవంత్ రెడ్డి లీక్ వీరుడు
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిన సీఎం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడారు.
చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మామూలోడు కాదని ఆయన ఓ లీకు వీరుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తాము ఏ విచారణకైనా సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. దమ్ముంటే ఇప్పుడే ఏ సంస్థతోనైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చంటూ ఆఫర్ ఇచ్చారు.
నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను కన్ ఫ్యూజ్ చేయొద్దంటూ సూచించారు రేవంత్ రెడ్డికి. పాలన చేతకాక ఇతరులపై నిందలు మోపడం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం మీదే ఉందని , అధికారం మీ చేతుల్లో పెట్టుకుని ఈ ఆర్భాటపు మాటలు ఎందుకంటూ ప్రశ్నించారు కేటీఆర్.