సింగరేణిని ప్రైవేటీకరిస్తే యుద్దం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – సింగరేణి జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. కేంద్రంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్.
లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు . సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమై పోయాయని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయని అన్నారు.