ఇనుప కంచెల మధ్య గన్ పార్క్
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ పార్టీ
హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పై , సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ ఎద్దేవా చేశారు.
అమర వీరుల స్థూపం చుట్టూ ఇనుప కంచెలను ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజా పాలన అన్నారు..కానీ చివరకు ఇనుప కంచెల మధ్య పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఆదివారం జరగనుందని, ఈ అరుదైన సమయంలో ఇలాంటి చెత్త నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కు అప్పగించారని, ఇక రాష్ట్ర రాజ ముద్రలో కూడా వేలు పెట్టారని, చివరకు తెలంగాణ అస్తిత్వం అనేది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం పై విరుచుకు పడ్డారు కేటీఆర్.