నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్ చేసిన కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం కామెంట్స్ అన్నీ బక్వాస్ అంటూ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు.
రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని నిలదీశారు కేటీఆర్. సోషల్ మీడియా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని, దానిపై అవగాహన లేకనే సీఎం రేవంత్ రెడ్డి చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. అమెరికాలో ఉన్న వాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారని , ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా అని అన్నారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసన్నారు. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయం 5 గంలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ నేతల బండారం తన వద్ద ఉందన్నారు.