గులాబీ దళం రైతుల పక్షం – కేటీఆర్
రేవంత్ రెడ్డి కుట్రలు చెల్లవంటూ ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 50 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన ఆయనకు ఏదైనా కుట్రగానే కనిపిస్తుందని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్.
మీ అల్లుడి ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు నిరసన తెలపడం కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ర పెసిడెంట్.
మీ అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు రైతులు తలొగ్గక పోవడం కుట్ర తప్ప మరోటి కాదన్నారు. నాయకులు అన్నాక ఎందరో ఏదో పై మాట్లాడుతూనే ఉంటారని , ఇది తప్పు ఎలా అవుతుందో సీఎంకే తెలియాలని అన్నారు.
ప్రజలు తమ బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కుట్ర అనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంతగా వేధింపులకు గురి చేసినా, కేసులు నమోదు చేసినా గులాబీ నేతలు ముందుకు సాగుతూనే ఉంటారని స్పష్టం చేశారు కేటీఆర్.
తొమ్మిది నెలల పాటు మీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసిన తర్వాత, మీ బెదిరింపులన్నింటినీ ఎదుర్కొన్న తర్వాత, వారు తిరుగుబాటు చేస్తే తప్పేముందన్నారు. పేద రైతు కుటుంబాలపై అర్ధరాత్రి దాడులు, అక్రమ అరెస్టులు, చిత్రహింసలకు వ్యతిరేకంగా ప్రశ్నించిన పాపానికి కేసు నమోదు చేయడం దారుణమన్నారు.
సీఎం తమను చూసి భయపడుతున్నారని పేర్కొన్నారు.