NEWSTELANGANA

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం

Share it with your family & friends

మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

సికింద్రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని స‌న‌త్ న‌గ‌ర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రోడ్ షో చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, ప‌ద్మా రావు గౌడ్ గ‌ట్టిగా అనుకుంటే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌న్నారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్ గురించి మాట్లాడాల్సిన ప‌ని లేద‌న్నారు.

గ్రామీణ‌, మండ‌ల ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు మోస పోయార‌ని, కానీ ప‌ట్టణం, న‌గ‌రంలో మాత్రం కాంగ్రెస్ మాయ మాట‌ల‌ను న‌మ్మి మోస పోలేద‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి 16 సీట్లు క‌ట్ట‌బెట్టార‌ని చెప‌పారు కేటీఆర్.

కాంగ్రెస్ వ‌చ్చాక హైద‌రాబాద్ లో దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పేర్కొన్నారు. కొత్త పెట్టుబ‌డులు వ‌చ్చే ఛాన్స్ లేకుండా పోయింద‌న్నారు. ఉన్న కంపెనీలే త‌ర‌లి పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.