మోసం కాంగ్రెస్ నైజం – కేటీఆర్
ఢిల్లీలో సురేష్..హరీశ్ రావుతో కలిసి
న్యూఢిల్లీ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోసానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే ఆ పార్టీ అని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూనే మరో వైపు తిలోదకాలు ఇచ్చేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.1967 లో హర్యానాలో గయాలాల్ అనే వ్యక్తి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని , అప్పటి నుంచే ఆయా రాం గయా రాం అనే సంస్కృతికి తెర లేచిందన్నారు.
2014కు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సార్లు ఛాన్స్ ఇచ్చారని , కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయిందన్నారు. ఆ పార్టీ చేసిన దారుణాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారని, ఉద్యమంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికిందన్నారు కేటీఆర్.
10 ఏళ్ల పాటు తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. కానీ ఇవాళ ప్రజలను మోసం చేసి గద్దెను ఎక్కిన కాంగ్రెస్ సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో బురిడీ కొట్టించిదని, అవి హామీలు కావు 420లు అంటూ మండిపడ్డారు కేటీఆర్.