ఇది కేంద్ర బడ్జెట్ కాదు ఏపీ బడ్జెట్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయని, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నా వాటి గురించి ప్రయారిటీ ఇవ్వక పోవడం దారుణమన్నారు .
ఒక రకంగా చెప్పాలంటే ఇది కేంద్ర బడ్జెట్ లా కనిపించడం లేదని, కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ లాగా అనిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అసలు రాష్ట్రం గురించి ఊసెత్తక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనిమిది మంది కాంగ్రెస్ మరో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని, వీరిలో ఇద్దరు కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నారని, వారికి తమ రాష్ట్రం పట్ల ఏమైనా సోయి ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్.
ప్రజలు తమకు జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు గ్రహించారని, తాము ఎంత పెద్ద తప్పు చేశామని అనేతి తేలి పోయిందన్నారు . ఏపీ రాజధానికి రూ. 15 వేల కోట్లు , పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఓకే చెప్పిన కేంద్రం తెలంగాణ గురించి ఎందుకు ఫోకస్ పెట్టలేక పోయిందని నిలదీశారు .