పెట్రో భారం ఇంకెంత కాలం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సంకీర్ణ సర్కార్ ను ఏకి పారేశారు. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. 2014లో పెట్రోల్ , డీజిల్ చార్జీలు అత్యంత తక్కువగా ఉండేవని, కానీ ఎప్పుడైతే మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరారో ఆనాటి నుంచి అమాంతం ఆయిల్ ఛార్జీలు పెంచుతూ పోతున్నారంటూ మండిపడ్డారు.
ఇంకోసారి గనుక మోదీ ప్రధానమంత్రి అయితే దేశం దివాళా తీయడం ఖాయమని హెచ్చరించారు కేటీఆర్. ప్రతి భారతీయుడు దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వాపోయారు.
పెట్రోల్ ధర లీటరుకు రూ. 40 పెరిగితే డీజిల్ ధర లీటర్ రూ. 40 పెరిగిందని ఒక్కసారి దీని గురించి ఆలోచించాలని, మీ విలువైన ఓటును పని చేసే పార్టీలు, నాయకులకు వేయాలని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తంగా మోదీ సర్కార్ బేకార్ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.