NEWSTELANGANA

దేశంలో చెల్ల‌ని నోటు రాహుల్ గాంధీ

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీపై భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న దేశంలో చెల్ల‌ని నోటు అంటూ పేర్కొన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయ‌లేద‌న్నారు. దానితో త‌న‌కు సంబంధం లేద‌న్నారు కేటీఆర్.

హైద‌రాబాద్ లో ప్ర‌స్తుతం తాగు నీరు అంద‌క ఇబ్బంది ఏర్ప‌డింద‌న్నారు. ఉచితంగా ట్యాంక‌ర్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. న‌గ‌ర వాసులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయ‌లేద‌న్నారు. అందుబాటులో ఉన్నా నీళ్లు ఇవ్వ‌కుండా ప‌గ‌బ‌ట్టారా అని ప్ర‌శ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌స్తుతం ఉన్న డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, మాజీ డీజీపీల‌ను కూడా విచార‌ణ చేప‌ట్టాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన 200 మంది రైతుల జాబితాను సీఎంకు పంపించామ‌ని , ఒక్కో రైతుకు రూ. 25 ల‌క్ష‌లు ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు కేటీఆర్.

కాంగ్రెస్ నుంచి తాను ఎమ్మెల్యేగా దానం నాగేంద‌ర్ గెల‌వ‌లేద‌న్నారు. స్పీక‌ర్ అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని లేక పోతే కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు.