రాహుల్ గాంధీ వేస్ట్ ఫెల్లో
కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. ఆయన ఈ దేశానికి పనికి వచ్చే నాయకుడు కాదని అన్నారు. మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లొంగి పోయారని ఆరోపించారు. ఆయన ఆశీస్సులు కావాలని కోరడం అంటే పూర్తిగా సరెండర్ అయినట్టుగా భావించాల్సి ఉందన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ వేస్ట్ ఫెల్లో అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ రకంగా చూస్తే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తిరిగి ఎన్నిక అవుతాడంటూ చెప్పడమేనని పేర్కొన్నారు కేటీఆర్.
నిన్నటి దాకా మోదీని, కేంద్రాన్ని, బీజేపీని అనరాని మాటలు అన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి కేసులు ఉన్నాయనే భయంతో మోదీని పొగడటమే పనిగా పెట్టుకోవడం దారుణమన్నారు మాజీ మంత్రి. ఇది పూర్తిగా తాకట్టు పెట్టడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు కేటీఆర్.