చీఫ్ మినిష్టర్ కాదు చీప్ మినిష్టర్
మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – తనపై అవాకులు చెవాకులు పేలుతూ అభ్యంతకరంగా మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన తెలంగాణకు చీఫ్ మినిష్టర్ కాదని చీప్ మినిష్టర్ అంటూ ఎద్దేవా చేశారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తా చెదారాన్ని మళ్లీ కార్యాలయంలోకి వచ్చిన రోజునే తొలగిస్తామని అన్నారు.
మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని అన్నారు కేటీఆర్.
బడి పిల్లల ముందు నీచమైన పద జాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచనను, అసభ్యకరమైన పెంపకాన్ని చూపుతుందని మండిపడ్డారు . బహుశా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ ను బట్టి చూస్తుంటే ఆయన మానసిక ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోందన్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ ఆయన స్థాయికి తగినట్టుగా లేవన్నారు కేటీఆర్. ఇకనైనా తన నోటిని అదుపులో ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు.