NEWSTELANGANA

ఖాకీల తీరుపై కేటీఆర్ క‌న్నెర్ర‌

Share it with your family & friends

జై తెలంగాణ అంటే దాడి చేస్తారా

వ‌రంగ‌ల్ జిల్లా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌మ కార్య‌క‌ర్త‌లు జై తెలంగాణ అన్నందుకు దాడి చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. థ‌ర్డ్ డిగ్రీ ఎలా ప్ర‌యోగిస్తారంటూ మండిప‌డ్డారు. శుక‌వ్రారం కేటీఆర్ వ‌రంగ‌ల్ ఎస్పీ అంబ‌ర్ కిషోర్ ఝాతో ఫోన్ లో మాట్లాడారు.

ఖాకీల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను కొట్ట‌డ‌మే కాకుండా హౌజ్ అరెస్ట్ ఎలా చేస్తారంటూ మండిప‌డ్డారు. కొంద‌రు పోలీసులు ప‌నిగ‌ట్టుకుని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఇవాళ వాళ్లు అధికారంలో ఉండ వ‌చ్చు..కానీ రేపు తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యంలో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని కానీ ఇలా అధికార పార్టీకి తొత్తులుగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారంటూ నిల‌దీశారు కేటీఆర్.

పోలీసుల తీరుపై తాము కోర్టులు, మాన‌వ హ‌క్కుల సంఘాల‌ను ఆశ్ర‌యిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా ప‌ర‌కాల ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌ను కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా వారికి పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దాడులను ఖండించారు.