ఆదివాసీ యోధుడు అరణ్య సూర్యుడు
కొమురం భీంకు ఘనంగా నివాళులు
హైదరాబాద్ – ఆదివాసీ యోధుడు..అరణ్య సూర్యుడు ! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ. దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు ! గోండు బెబ్బులి ..కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్టోబర్ 17న కొమురం భీం వర్దంతి.
ఉద్యమ బాటలో..ఉజ్వల ప్రగతి దారిలో జల్ ..జంగల్ ..జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామన్నారు. కొండల్లో..కోనల్లో వున్న ప్రతి గూడేనికి, తండాకు స్వచ్ఛమైన మంచినీళ్ల సరఫరాతో విష జ్వరాల చావుల నుంచి విముక్తి..కల్పించడం జరిగిందన్నారు.
4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై హక్కులు కల్పిస్తూ.. అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేశామన్నారు. మావనాటే మావరాజ్ .. స్వరాష్ట్రంలో నెరవేరిన మా గూడెంలో మా తండాలో మా రాజ్యం ఆకాంక్ష.. 2,471 గిరిజన పంచాయతీల్లో ఎగిరిన స్వయం పాలనా జెండా అని తెలిపారు కేటీఆర్.
అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం సముచిత వాటా దక్కేలా ..గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 188 గురుకుల పాఠశాలలు..125 గురుకుల ఇంటర్ కాలేజీలు..22 గురుకుల డిగ్రీ కళాశాలలతో అడవి బిడ్డల విద్యా వికాసానికి నిబద్ధతతో కృషి చేశామన్నారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ తో విదేశీ చదువుల కలలు సాకారం చుట్టామన్నారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన సీఎంఎస్టీఈఐ స్కీం అని పేర్కొన్నారు కేటీఆర్.
మహనీయుడు కుమురం భీం పేరుతో..కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన అస్తిత్వ రెపరెపలు..కుమరం భీం ఆదివాసీ భవన్..సేవాలాల్ బంజారా భవన్ల నిర్మాణం చేపట్టామన్నారు కేటీఆర్.
గిరిజన సంస్కృతికి గొప్ప గౌరవం..సమ్మక్క సారక్క జాతర.. నాగోబా.. జంగుబాయి.. చెంచుల బౌలాపూర్..ఎరుకల నాంచారమ్మ..గాంధారి మైసమ్మ..కొలాం పండుగలకు భారీగా నిధులు..అధికారికంగా నిర్వహణ చేసిన ఘనత తమదేనని స్పష్టం చేశారు .