NEWSTELANGANA

కేసీఆర్ ప్ర‌య‌త్నం ఎన్టీపీల నిర్మాణం – కేటీఆర్

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీపీల సంద‌ర్శ‌న

హైద‌రాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్ లో నిర్మించిన ఎస్టీపీల‌ను సంద‌ర్శించారు. ఆయ‌న వెంట మాజీ మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రా రెడ్డి ఉన్నారు. ఈ సంద‌ర్బంగా కూక‌ట్ ప‌ల్లి ఫ‌తే న‌గ‌ర్ లో నిర్మించిన ఎస్టీపీని సంద‌ర్శించారు. దేశంలోనే ఈ నిర్మాణం కొత్త‌ద‌న్నారు.

ఆనాడు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎంతో ముందు చూపుతో దీనికి ప్లాన్ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలోనే వీటిని నిర్మించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా మురుగునీ టి రహిత నగరంగా మార్చే ప్రయత్నం చేశామ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

కేసీఆర్ దృఢ సంకల్పం, ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇవాళ ఎస్టీపీని చూసినప్పుడు ఎంతో సంతోషం క‌లిగింద‌ని చెప్పారు మాజీ మంత్రి. ఎస్టీపీల సందర్శనల్లో ఇది మొదటి అడుగు మాత్రమేన‌ని.. మిగిలిన ఎస్టీపీలను కూడా సందర్శించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని ఆనాడు త‌మ స‌ర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ద‌ని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలోని 94 శాతం స్వచ్ఛమైన నీరు మూసికి వెళ్తున్నప్పుడు మూసి నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్ర‌శ్నించారు కేటీఆర్.

వంద శాతం మురుగునీటి శుద్ధి జరిగిన తర్వాత మూసి ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిల‌దీశారు మాజీ మంత్రి.