NEWSANDHRA PRADESH

బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

అమ‌రావ‌తి – మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు ఇంకా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయ‌ని, వ‌ర‌ద‌లు పోటెత్తే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. వరద బాధితులకి కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేక పోతోందని మండిప‌డ్డారు కుర‌సాల క‌న్న‌బాబు.

ఎన్టీఆర్ జిల్లాలో 2.37 లక్షల కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని అంచనా వేసిన ప్రభుత్వం.. 8 రోజుల తర్వాత ఇచ్చింది కేవలం 55,452 కుటుంబాలకి మాత్రమే అని ఆరోపించారు.

ప్ర‌చార ఆర్భాటం త‌ప్పా చేసింది ఏమీ లేద‌ని అన్నారు కుర‌సాల క‌న్న‌బాబు. ఓ వైపు వ‌ర‌ద బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంద‌ని అయినా సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించ‌క పోవ‌వ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి.

త‌న ఇంటిని కాపాడు కోవ‌డం కోసం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద‌లు తీసుకు వ‌చ్చేలా చేశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు కుర‌సాల క‌న్న‌బాబు. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.