కుమార స్వామికి బంపర్ ఆఫర్
కేబినెట్ లో చేర్చుకునే ఛాన్స్
న్యూఢిల్లీ – నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కించు కోనున్నారు మాజీ సీఎం కుమార స్వామి. ఆయన ఎంపీగా గెలుపొందారు. జేడీఎస్ ఇప్పుడు బేషరతు మద్దతు ప్రకటించింది మోడీ నాయకత్వానికి.
ఇప్పటికే ఎన్డీయేలో కీలకమైన పాత్ర పోషించ బోతున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్. ఈ ఇద్దరికీ బంపర్ ఆఫర్ ఇస్తోంది భారతీయ జనతా పార్టీ. లెక్కకు సరిపడా సంఖ్యా బలాన్ని పొందలేక పోయింది బీజేపీ. ఇదే సమయంలో మోడీని, రాముడిని ముందుకు తెచ్చి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా 295 సీట్లు సాధించలేక పోవడంతో అమిత్ షా నానా తంటాలు పడుతున్నారు.
ముందు జాగ్రత్తగా చేజారి పోకుండా ఉండేందుకు అందరితో తమకు మద్దతు ఇస్తున్నట్లు లేఖలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ కూడా కీలకం కానుంది. మాజీ సీఎం కుమార స్వామి గెలవడం, ఆయన మోడీని కలవడంతో తనకు కూడా కేబినెట్ లో చోటు దక్కనుందని టాక్.