NEWSTELANGANA

సీఎం సారూ చ‌ల్లంగ ఉండు

Share it with your family & friends

కుమారి ఆంటీ స్పంద‌న

హైద‌రాబాద్ – స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నిర్వ‌హిస్తున్న కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల‌లో ఒక్క‌సారిగా వైర‌ల్ గా మారారు. ఆమె సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. దీనికి కార‌ణం పోలీసులు ఆమె స్టాల్ ను విప‌రీత‌మైన ర‌ద్దీ కార‌ణంగా తొల‌గించారు. ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌డంతో కేసు కూడా న‌మోదు చేశారు.

ఈ విష‌యం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంట‌నే స్పందించారు. కుమారి ఆంటీ ఎప్ప‌టి లాగే త‌న ఉన్న చోటునే అమ్ము కోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు పునః ప‌రిశీలించాల‌ని డీజీపీ ర‌వి గుప్తాను ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల రోడ్డు సైడ్ గా కుమారి ఆంటీ టీ, టిఫిన్స్ , భోజ‌నం అమ్ముతోంది. ఆమె చేసే వంట‌లు బాగున్నాయంటూ యూట్యూబ‌ర్ ఆమెను ఇంట‌ర్వ్యూ చేశారు. ఆ వెంట‌నే ఆ వీడియో హ‌ల్ చ‌ల్ అయ్యింది.

భారీ ఎత్తున జ‌నం గుమి గూడ‌డం మొద‌లు పెట్టారు. చివ‌ర‌కు కేసు న‌మోదు దాకా వెళ్ల‌డంతో రాద్దాంతం చోటు చేసుకుంది. తాను కూడా త్వ‌ర‌లో ఫుడ్ స్టాల్ ను సంద‌ర్శిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు తిరిగి అమ్ముకునేందుకు ఛాన్స్ ఇచ్చిన కుమారి ఆంటీ రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.