ENTERTAINMENT

కుషిత కెవ్వు కేక

Share it with your family & friends

హైద‌రాబాద్ జ‌ట్టుకు ఫిదా

హైద‌రాబాద్ – ఐపీఎల్ 2024 సీజ‌న్ లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు కొంద‌రు. వారిలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు య‌జ‌మాని , సీఈవో కావ్య మారన్. ఆమె నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక న‌టీ న‌టులతో పాటు యాంక‌ర్లు సైతం దుమ్ము రేపుతున్నారు. ఈ త‌రుణంలో గ‌త సీజ‌న్ లో తీవ్ర‌మైన నిరాశ‌కు గురి చేస‌న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈసారి 17వ ఐపీఎల్ సీజ‌న్ లో మాత్రం దుమ్ము రేపుతోంది.

అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటింది. త‌న‌కు ఎదురే లేదంటూ ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. ఇది ప‌క్క‌న పెడితే టాలీవుడ్ కు చెందిన పలువురు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. తాజాగా ఆర్టిస్ట్ కుషిత క‌ల్లాపు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఈ మేర‌కు ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

క్రికెట్ కు సినీ రంగానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎక్క‌డికి వెళ్లినా క్రికెట‌ర్లు, సినీ న‌టీ న‌టులు క‌లిసి ఉండడం ష‌రా మూమూలుగా మారింది. మొత్తంగా కుషిత కెవ్వు కేక అంటున్నారు చూసిన వారంతా.