NEWSNATIONAL

ల‌డ‌క్ ఉద్య‌మ‌కారుడు వాంగ్ చుక్ అరెస్ట్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సిసోడియా..సీఎం అతిషి

ఢిల్లీ – ప్ర‌ముఖ సామాజిక ఉద్య‌మ‌కారుడు , ల‌డ‌ఖ్ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌త కొంత కాలంగా ల‌డ‌ఖ్ ను రక్షించాల‌ని కోరుతూ ఆయ‌న దీక్ష చేప‌ట్టారు. ఆందోళ‌న కూడా చేప‌ట్టారు. ల‌డ‌ఖ్ ను విధ్వంసం చేయొద్దంటూ విన్న‌వించారు.

ల‌డ‌ఖ్ ను కాపాడాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున ల‌డ‌ఖ్ వాసుల‌తో క‌లిసి ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీ బోర్డ‌ర్ వ‌ద్ద సోన‌మ్ వాంగ్ చుక్ తో పాటు కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఆయ‌న అరెస్ట్ చేసిన విష‌యాన్ని తెలుసుకున్న వెంట‌నే ఢిల్లీ ముఖ్య‌మంత్రి అతిషి సింగ్ తో పాటు మ‌నీష్ సిసోడియా పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఇది పూర్తిగా బీజేపీ, మోడీ, షా రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఒక నెల క్రితం లేహ్ నుండి ప్రారంభమైన ‘ఢిల్లీ చలో పాదయాత్ర’కు వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నాడు. అతనితో పాటు లడఖ్‌కు చెందిన మరో 120 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.