చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి ఫైర్
ఎవరు ఉన్మాదులో జనానికి తెలుసు
అమరావతి – వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. ఎవరు ఉన్మాదులో తెలియదా అని ప్రశ్నించారు.
3 లక్షల మందికి జీతాలు ఇచ్చి ఐటీడీపీ ( ITDP ) పేరుతో వేధింపులు చేసింది ఎవరు అని నిలదీశారు లక్ష్మీ పార్వతి.
జగనన్న ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా చెప్పుకున్నందుకు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఎవరు? అధికారం చేతిలో ఉంది కదా అని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నది ఎవరో తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచ చరిత్రలో హిట్లర్ వంటి నియంతలే దిక్కులేని చావు చచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు అదే తరహాలో గతి పట్టనుందని హెచ్చరించారు. అసలైన తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడో పోయిందన్నారు లక్ష్మీ పార్వతి.
పెద్దవయసు అని కూడా చూడకుండా తమ ఫోటోలు నగ్నంగా పెట్టిన ఐటీడీపీ కంటే నీచంగా ఏ సోషల్ మీడియా అయినా ఉందా? అని ఫైర్ అయ్యారు.