వైసీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీ పార్వతి
ప్రకటించిన పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వెల్లడించారు .
జగన్ మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తున్నారు లక్ష్మీ పార్వతి. ఆమె పార్టీ తరపున ప్రజల గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా నారా చంద్రబాబు నాయుడును ఆయన పరివారాన్ని ఏకి పారేస్తున్నారు. ఎంతటి మోసగాడనే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో సక్సెస్ అయ్యారు లక్ష్మీ పార్వతి.
ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా కీలకమైన నాయకులకు పార్టీ పదవులను అప్పగిస్తున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణను శాసన మండలిలో మండలి పక్ష నేతగా ఎంపిక చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణికి పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను వచ్చే జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కూటమి సర్కార్ పై ఇక యుద్దమే మిగిలిందని హెచ్చరించారు జగన్ రెడ్డి.