ప్రజా యుద్ద నౌకపై షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ పై నోరు పారేసుకున్నారు. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేది లేదన్నారు. పద్మ పురస్కారాల్లో కేంద్రం వివక్ష చూపించిందంటూ మోడీ సర్కార్ పై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.
తను చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్ర సర్కార్ పంపిన పేర్లను పరిశీలించి, అర్హులకే అవార్డులు ఇస్తుందన్నారు. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ కూడా ఒకరని, ఆయనకు పురస్కారం ఎలా ఇస్తామన్నారు బండి.
నక్సలిజం భావజాలం కలిగిన గద్దర్ బీజేపీ కార్యకర్తలను చంపించేందుకు ప్రయత్నం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బరా బర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మిశ్రమ స్పందన లభించింది. నక్సలైట్లుగా మారేందుకు గద్దరే కారణమని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.