NEWSANDHRA PRADESH

ఏపీ పునర్నిర్మాణానికి సాయం అవ‌స‌రం

Share it with your family & friends

టీడీపీ నేత లావు శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు

అమ‌రావ‌తి – ఏపీ తెలుగుదేశం పార్టీ నేత లావు కృష్ణ దేవ రాయులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బ‌డ్జెట్ పై స్పందించారు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

గత 5 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న గురించి కూడా ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డ్డారు. అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీశారని ఆరోపించారు.

2014‌-19 టిడిపి హయాంలో జల వనరులు, రహదారుల కల్పనకు పెద్ద పీట వేశారని అన్నారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయించేంది ఏమీ లేద‌న్నారు లావు కృష్ణ దేవ రాయులు. విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ ఏపీకి చట్టంలో ఇచ్చిన హామీల గురించి మర్చి పోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఏపీని అశాస్త్రీయంగా విభజించారని ఆవేద‌న చెందారు. విభజన చట్టంలోని హామీల ప్రకారమే నిర్మలా సీతారామన్ అమరావతి, పోలవరానికి కేటాయింపులు చేశార‌ని అన్నారు. సెక్షన్ 94లోనే అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని ఉందన్నారు.