క్రిమినల్ చట్లాలపై లాయర్ల కన్నెర్ర
మానవ హక్కుల ఉల్లంఘనంటూ ఫైర్
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ బీజేపీ సర్కార్ కొత్తగా తీసుకు వచ్చిన క్రిమినల్ చట్టాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులు. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం సుప్రీంకోర్టులో విధులను బహిష్కరించారు.
కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటాయని ఆరోపించారు. ఒక క్లాజు (సెక్షన్ 187(3)) పోలీసు కస్టడీని 15 రోజుల నుండి 60-90 రోజులకు పొడిగించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన నిబంధనలంటూ మండిపడ్డారు న్యాయవాదులు.
కస్టడీలో దుర్వినియోగం, నిర్బంధంలో ఉన్న వ్యక్తుల హక్కులపై ప్రత్యక్ష దాడికి సంబంధించిన సందర్భాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులతో పాటు ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే కేంద్ర సర్కార్ కొత్త క్రిమినల్ చట్టాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. అధికంగా భారం పెరిగిన న్యాయ వ్యవస్థపై మరింత అదనపు ఒత్తిడి పెరిగేలా ఉందన్నారు. గతంలో బ్రిటీష్ కాలంలో తయారు చేసిన చట్టాలను పూర్తిగా మార్చేసిందన్నారు.
కొత్త చట్టాలు దేశ వ్యాప్తంగా జూలై 1 నుండి అమలులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున కోర్టులలో న్యాయవాదులు బహిష్కరించారు. ప్రధానమంత్రి మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.