ఏపీలో మళ్లీ జగనే సీఎం
లక్ష్మీ పార్వతి ప్రకటన
అమరావతి – ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా సరే తిరిగి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తనకు మాత్రమే దక్కిందన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చడమే కాకుండా వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నది కూడా ఏపీ సర్కారేనని గుర్తు పెట్టుకోవాలన్నారు.
జూన్ 4వ తేదీ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడ బోతోందని చెప్పారు లక్ష్మీ పార్వతి. దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు.
నిత్యం కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేసే టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూటమికి ఈసారి కూడా భంగపాటు తప్పదన్నారు.