నిప్పులు చెరిగిన నందమూరి లక్ష్మీ పార్వతి
అమరావతి – వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన భర్త , దివంగత ఎన్టీఆర్ ఎలా చని పోయారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించారు. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని, ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయని వాపోయారు. జనం సాక్షిగా పెళ్లి చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
తాను చేసిన తప్పు ఏమిటో తనకు ఇంకా తెలియడం లేదన్నారు. శనివారం నందమూరి లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. ఆనాడు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో అధికారం చేతిలో ఉన్నప్పటికీ ఏనాడూ పరిధి దాట లేదని చెప్పారు.
అయినా ఇప్పటికీ అవే అబద్దాలు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. స్వంత బిడ్డలు తండ్రి ఇబ్బందులు పడుతుంటే చూసిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు నివాళులు ఎలా అర్పిస్తారంటూ ప్రశ్నించారు. కేవలం ఆయన సంపాదించిన ఆస్తుల కోసం మాత్రమే ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి.