నాలుగు పోస్టులలో క్వీన్ స్వీప్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జే ఎన్ యూ) లో జరిగిన ప్రతిష్టాత్మకమైన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఊహించని రీతిలో ఏబీవీపీకి బిగ్ షాక్ తగిలింది. మొత్తం నాలుగు పోస్టులలో వామపక్ష విద్యార్థి సంఘాలు జయకేతనం ఎగుర వేశారు.
అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) కు చెందిన ధనుంజయ్ 2,598 ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుపొందారు. దీంతో యూనివర్శిటీ వాతావరణం ఒక్కసారిగా మారి పోయింది. లాల్ సలాం, జై భీమ్ నినాదాలతో మారుమ్రోగింది. విజేతలను వారి మద్దతుదారులు అభినందించారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వామపక్ష మద్దతు ఉన్న గ్రూపుల నుండి తన మొదటి దళిత అధ్యక్షుడిని ఆదివారం ఎన్నుకుంది. ఈ ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ క్వీన్ స్వీప్ చేసింది. దాని సమీప ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీని చిత్తుగా ఓడించింది.
ధనంజయ్ బీహార్ లోని గయాకు చెందిన వాడు. 1996-97 లో ఎన్నికైన బట్టి లాల్ బైర్వా తర్వాత వామపక్షాల నుండి వచ్చిన తొలి దళిత సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు కావడం విశేషం.