NEWSANDHRA PRADESH

తాడిప‌త్రి ఘ‌ట‌న దారుణం

Share it with your family & friends

పోలీసులే దాడులు చేస్తే ఎలా

అనంత‌పురం జిల్లా – రాష్ట్రంలో జ‌రిగిన పోలింగ్ సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న దారుణ‌మ‌ని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులే ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్ప‌డ‌టం విస్తు పోయేలా చేసింద‌న్నారు.

ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సీసీ ఫుటేజీలో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని చెప్పారు. దీనిని ఎవ‌రూ బ్ల‌ఫ్ చేయ‌లేర‌ని మండిప‌డ్డారు. పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశార‌ని ఆరోపించారు. అంతే కాకుండా కావాల‌ని త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ఇంట్లో బీభ‌త్సం సృష్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు , ప్ర‌జా ప్ర‌తినిధులు సంమ‌య‌నం పాటించార‌ని చెప్పారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి. ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌త్వ‌ర‌మే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.