జన నేత జయ ప్రకాశ్ నారాయణ్
అక్టోబర్ 11 ఆయన జయంతి
హైదరాబాద్ – లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జయంతి ఇవాళ. భారత దేశ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన అరుదైన ప్రజా నాయకుడు. సోషలిస్టు విప్లవానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించిన ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి చుక్కలు చూపించి, జైలులో ఉంచేలా చేసిన ఏకైక నాయకుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్. ఆయన సోషలిస్ట్ ఐకాన్.
1902లో పుట్టిన ఆయన 1979లో కన్ను మూశారు. తన జీవిత కాలమంతా ప్రజల కోసం పని చేశారు. సంపూర్ణ సోషలిస్టు ఉద్యమం ద్వారా అన్ని వర్గాలను కలిపేందుకు ప్రయత్నం చేశాడు జయప్రకాశ్ నారాయణ్. రాజకీయం అంటే పదవి కోసం కాదని సేవ చేసేందుకుని ఆయన పేర్కొన్నారు.
నిజమైన సోషలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే జేపీ మాత్రమేనని చెప్పక తప్పదు. ఆనాడు తను కావాలని అనుకుంటే పీఎం కాగలడు..కానీ పదవిని వద్దని ఖరాఖండిగా నెహ్రూకు చెప్పాడు. తాను పేదల వద్దకు వెళ్లి ప్రజా సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. జేపీ అవినీతి, దుష్పపరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు.
ఈ ఉద్యమం ప్రజలకు తమ హక్కులు ఏమేం ఉంటాయని తెలుసుకునేలా చేశాడు జేపీ. ఎమర్జెన్సీ వినాశకరమైన ప్రయోగం తర్వాత ఏ నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదని భయపడేలా చేశాడు జయప్రకాశ్ నారాయణ్.
ఆనాడు ఇందిరా గాంధీ ఓడి పోయినప్పుడు జేపీ ప్రధానమంత్రి కాగలడు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు. నమ్మిన విలువల కోసం కట్టుబడిన అరుదైన రాజకీయ నాయకుడు జేపీ.