పార్లమెంట్ ఎన్నికలకు వేళాయె
మార్చిలో నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ – దేశంలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయా. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికలు వస్తాయని, సిద్దంగా ఉండాలని ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు రావాలని భావిస్తోంది. ఇది పక్కన పెడితే దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
మరో వైపు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల పేరుతో ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. ఇది ఒక రకంగా అన్ని పార్టీలకు దెబ్బేనని చెప్పక తప్పదు.
మరో వైపు దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన పార్టీగా బీజేపీ నెంబన్ వన్ స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అన్ని బ్యాంకు అకౌంట్లను ఐటీ సీజ్ చేసింది. దీంతో లావాదేవీలకు ఇబ్బందిగా మారింది.
తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే మార్చి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏప్రిల్ లో తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఉంటాయని టాక్.