కేంద్రంలో హంగ్ కే ఛాన్స్
లోక్ సభ ప్రీ పోల్ సర్వే రిజల్ట్స్
న్యూఢిల్లీ – ఈసారి లోక్ సభ ఎన్నికల్లో హంగ్ కే ఛాన్స్ ఉందా ..అవుననే అంటున్నాయి పలు సర్వే సంస్థలు. ఈ మేరకు తాజాగా ప్రకటించిన సర్వేలో ఊహించని రీతిలో ఫలితాలు రానున్నాయని అంచనా. ఇదిలా ఉండగా మొత్తం 545 స్థానాలకు గాను 543 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా పొలిటికల్ క్రిటిక్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ముందస్తు ఫలితాలను వెల్లడించింది. ఈ మేరకు లోక్ సభలో హంగ్ కే ఎక్కువ ఛాన్స్ ఉందని పేర్కొనడం విశేషం.
ఇండిపెండెంట్లు కీలకంగా మారే ఛాన్స్ ఉందని సమాచారం. ఇండియా కూటమికి 225 నుంచి 235 స్థానాలు వస్తాయని , ఇక ఎన్డీయే కూటమికి 265 నుంచి 275 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని వెల్లడించింది. ఇతరులు 41 నుండి 45 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడింది.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కోవిడ్ లో తప్పుడు సమాచారం, మత సామరస్యాన్ని నెలకొల్పడంలో నిర్లక్ష్యం అని సంస్థ పేర్కొంది.