NEWSNATIONAL

26న లోక్ స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌..?

Share it with your family & friends

21న రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం

న్యూఢిల్లీ – కేంద్రంలో న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని ఎన్డీయే, బీజేపీ కూట‌మి ప్ర‌భుత్వం కొలువు తీరింది. మోడీ త‌న టీమ్ లో 72 మందికి చోటు క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా ఈనెల 17 నుండి లోక్ స‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్న‌ట్లు సమాచారం. 18, 19 తేదీల‌లో కొత్త‌గా ఎన్నికైన 543 మంది ఎంపీలు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

లోక్ స‌భ స‌మావేశాలు దాదాపు 8 రోజుల పాటు జ‌ర‌గున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు కీల‌క‌మైన స్పీక‌ర్ పోస్టు ఎవ‌రిని వ‌రిస్తుందోన‌న్న ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కీల‌క పార్టీలైన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప‌ట్టు ప‌డుతున్న‌ట్లు టాక్.

సంకీర్ణ స‌ర్కార్ కు చెందిన స‌భ్యులు స్పీక‌ర్ ను ఈనెల 26న ఎన్నుకోనున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర‌ప‌తి ముర్ము ప్ర‌సంగించ‌నున్నారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా ఉన్న కిర‌ణ్ రిజిజు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయ‌న గ‌తంలో న్యాయ, క్రీడా శాఖ‌లు నిర్వ‌హించారు.

మోడీ, అమిత్ చంద్ర షా ఎవ‌రికి స్పీక‌ర్ ప‌ద‌వి క‌ట్ట బెడ‌తార‌నే దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.