లోక్ సభ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ
సంచలన కామెంట్స్ చేసిన ఓం బిర్లా
న్యూఢిల్లీ – దేశంలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే – భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లోక్ సభ స్పీకర్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దేశానికి సంబంధించిన చట్టాలను తయారు చేయడంలో, సభను నిర్వహించడంలో కీలకమైన పాత్ర స్పీకర్ పై ఉంటుంది. అందుకే దీనికంతటి ప్రాధాన్యత ఏర్పడింది.
గతంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆశించిన మేర మెజారిటీ రాలేదు బీజేపీకి. దీంతో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీతో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలకంగా మారారు. ఈ ఇద్దరు నేతలు తమకే స్పీకర్ పదవి కావాలని పట్టు పట్టారు. దీంతో సందిగ్ధం నెలకొంది.
నిన్నటి దాకా దేశాన్ని శాసిస్తూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాలు ఇప్పుడు బేల చూపులు చూస్తున్నారు. బాబు, నితీష్ లను బుజ్జగించే పనిలో పడ్డారు. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా. కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు.