ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం గాలింపు
లుక్ అవుట్ నోటీసు జారీ
అమరావతి – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రవర్తించిన తీరు..ప్రధానంగా పోలింగ్ సందర్బంగా ఈవీఎంను నేల కేసి కొట్టడం. అడ్డుకోబోయిన వారిని దాడికి గురి చేయడం మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ లో లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అరెస్ట్ చేసి తీరాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా డీజీపీని ఆదేశించారు.
దీంతో పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు. ఆయన విదేశాలకు పారి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పిన్నెల్లి అరెస్ట్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు.
పిన్నెల్లి సోదరుల కోసం హైదరాబాద్ కు వెళ్లాయి గాలింపు బృందాలు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు . ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా పిన్నెల్లిపై పీడీ పీపీ చట్టం కింద మరో కేసు కూడా నమోదు చేశారు.