దేశం చూపు ఫలితాల వైపు
మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా మంగళవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. 545 స్థానాలకు గాను 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత భారత కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఊహించని రీతిలో 7 విడతలుగా ఎన్నికలు నిర్వహించింది. దేశంలో కొన్ని చోట్ల చెదురు మదురు సంఘటనలు తప్పా అంతా ప్రశాంతంగా ముగిసింది.
ఇవాళ పోలింగ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశానికి చెందిన 143 కోట్ల మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ కోసం. 2019లో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి ఎన్నికలు చోటు చేసుకున్నాయి.
మోడీ సర్కార్ ఫిర్ ఏక్ బార్ అంటూ భారతీయ జనతా పార్టీ నినాదంతో ముందుకు వెళ్లింది ప్రచారం చేపట్టింది. ఇక ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి మాత్రం మూకుమ్మి దాడి చేసింది మోడీ సర్కార్ పై.
మొత్తంగా ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగిందని తేలి పోయినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం 390కి పైగా బీజేపీకి సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఏది ఏమైనా సాయంత్రానికల్లా రిజల్ట్స్ రానున్నాయి.