సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు బీహార్ కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 2 ఫోర్లు 3 సిక్సర్లతో 20 బంతులు ఎదుర్కొని 34 రన్స్ చేశాడు. తన కెరీర్ లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచి ఔరా అని పించేలా చేశాడు. అంతే కాదు అవేశ్ ఖాన్ కు చుక్కలు చూపించాడు. భారీ సిక్స్ కొట్టాడు. తన దూకుడు చూస్తే ఈ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా. కానీ మార్కరమ్ బౌలింగ్ లో షాట్ కొట్టేందుకు ముందుకు రావడంతో తెలివిగా పంత్ స్టంపింగ్ చేయడంతో పెవిలియన్ బాట పట్టాడు. కంట తడి పెట్టాడు. మ్యాచ్ ముగిశాక లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తనను ఓదార్చాడు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడింది. జైశ్వాల్, వైభవ్ కలిసి తొలి వికెట్ కు 85 రన్స్ జోడించారు. మరోసారి నితీశ్ రాణా నిరాశ పరిచాడు. తను కేవలం 8 పరుగులే చేశాడు. యశ్ ఠాకూర్ ఔట్ చేశాడు. రియాన్ పరాగ్ 39, జైశ్వాల్ 74 రన్స్ చేసినా చివరి ఓవర్ లో 9 రన్స్ చేయలేక చేతిలో వికెట్లను పెట్టుకుని చేజేతులారా మ్యాచ్ ను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఇలాగే రాజస్థాన్ ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్ లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది. సూపర్ ఓవర్ లో ఓడి పోయింది.