సంజీవ్ గోయెంకా తీరుపై ఫైర్
కేఎల్ రాహుల్ పై తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ – ఐపీఎల్ లో కీలకమైన లీగ్ మ్యాచ్ ముగిసింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా జట్టు స్కిప్పర్ కేఎల్ రాహుల్ పై నోరు పారేసు కోవడం, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో కీలకమైన లీగ్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసింది లక్నో. నిర్ణీత 20 ఓవర్లలో 165 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పిచ్చ కొట్టుడు కొట్టింది. లక్నో బౌలర్లను ఉతికి ఆరేశారు బ్యాటర్లు హెడ్ , అభిషేక్ శర్మ. ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఓటమి అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ ను పట్టుకుని సంజీవ్ గోయెంకా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగేనా ఆడేది అంటూ మండిపడ్డారు. క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా 2022లో రికార్డు స్థాయిలో రూ. 17 కోట్లకు తీసుకుంది రాహుల్ ను.
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో వైదొలిగింది. ఇంకా మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా ఇప్పటికే కోల్ కతా, రాజస్థాన్ , చెన్నై, హైదరాబాద్ చేరుకున్నాయి.