ఆట తీరు బాగోలేదంటూ మండిపాటు
ఉత్తర ప్రదేశ్ – లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా మరోసారి చర్చనీయాంశంగా మారాడు. తను పక్కా వ్యాపారవేత్తనంటూ చెప్పకనే చెప్పాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో ఎవరూ ఊహించని ధరకు ఢిల్లీకి చెందిన రిషబ్ పంత్ ను కొనుగోలు చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంత భారీ ప్రైస్ కు అమ్ముడు పోవడం సంచలనంగా మారింది. తీరా చూస్తే ఈసారి ఐపీఎల్ 2025లో మాత్రం ఆశించిన మేర రాణించడం లేదు రిషబ్ పంత్. అటు కెప్టెన్ గా ఇటు ఆటగాడిగా తన ఆటతీరు దారుణంగా ఉంది. ఇప్పటి వరకు తను ఆడిన మ్యాచ్ లలో చేసిన పరుగులు కేవలం 17 మాత్రమే.
దీంతో పంజాబ్ కింగ్సె ఎలెవన్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది లక్నో సూపర్ జెయింట్స్ .
మైదానంలోనే ఎస్ ఎస్ జీ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే రిషబ్ పంత్ ను చెడా మడా తిట్ల దండకం అందుకున్నాడు. స్పోర్ట్స్ పరంగా కొన్ని రూల్స్ ఉంటాయని మరిచి పోయాడు. ఇలా ప్రవర్తించడం బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ కు విరుద్దమని తెలిసి కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదు. గత సీజన్ లో సైతం ఇలాగే వ్యవహరించాడు. నవ్వుల పాలయ్యాడు. తమ జట్టుకు కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసుకున్నారు. తన ఆట తీరుతో ఆకట్టుకోక పోవడంతో రాహుల్ పై నోరు పారేసుకున్నాడు. దీంతో అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యాడు. తాజాగా పంత్ పై అరుస్తున్న విజువల్స్, ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.