రాహుల్ సూపర్ డికాక్ అదుర్స్
లక్నో చేతిలో చెన్ని చిత్తు చిత్తు
లక్నో – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ పోరులో కేఎల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతైమన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్ ఆశలను ఉంచుకుంది. వరుసగా ఆ జట్టు ఓటమి పాలవుతూ వస్తోంది. కానీ ఈ మ్యాచ్ లో జూలు విదిల్చింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ , క్వింటన్ డికాక్ దుమ్ము రేపారు. అద్భుతమైన ఆట తీరు తో ఆకట్టుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు . మైదానం నలువైపులా కళ్లు చెదిరే షాట్స్ తో అలరించారు ఈ ఇద్దరు ప్లేయర్లు.
చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది లక్నో సూపర్ జెయింట్స్. రికార్డు స్థాయిలో కేఎల్ రాహుల్, డికాక్ తొలి వికెట్ కు ఏకంగా 134 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 53 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్సర్లతో 82 రన్స్ చేస్తే డికాక్ 43 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ తో 54 రన్స్ చేశాడు.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 176 రన్స్ చేసింది. జడేజా 40 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 57 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అజింక్యా రహానే 36 పరుగులు చేస్తే ఆఖరున వచ్చిన ధోనీ సూపర్ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.