లక్నో జోష్ గుజరాత్ కు షాక్
33 పరుగుల తేడాతో గెలుపు
ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ పై 33 రన్స్ తేడాతో ఓడించింది. మార్కస్ స్టోయినిస్ , యశ్ ఠాకూర్ లు అద్భుతంగా రాణించడంతో ఇది సాధ్యమైంది.
స్టోయినిస్ 43 బంతులు ఎదుర్కొని 58 రన్స్ చేశాడు. ఇక లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 31 బాల్స్ ఎదుర్కొని 33 పరుగులు చేయడంతో మూడో వికెట్ కు భారీ స్కోర్ నమోదు చేశారు. నికోలస్ పూరన్ 22 బాల్స్ లో 32 రన్స్ చేశాడు. దీంతో 5 వికెట్లు కోల్పోయి 163 రన్స్ చేసింది.
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ లక్నో బౌలర్ల దెబ్బకు ఠారెత్తి పోయింది. 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేసి చాప చుట్టేసింది. ప్రధానంగా యశ్ ఠాకూర్ కళ్లు చెదిరే బంతులతో బెంబేలెత్తించాడు. కేవలం 30 రన్స్ మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు కూల్చాడు. ఇక కృనాల్ పాండ్యా 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
ఇక గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ ఒక్కడే రాణించాడు. 21 బంతులు ఎదుర్కొని 31 రన్స్ చేశాడు. మిగతా వారు ఎవరూ దరి దాపుల్లోకి రాలేక పోయారు. కెప్టెన్ గిల్ 19 రన్స్ చేశాడు. విజయ్ శంకర్ 17 రన్స్ చేస్తే రాహుల్ తెవాటియా 25 బాల్స్ ఎదుర్కొని 30 రన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది.