కోల్ కతా అదుర్స్ లక్నో బేవార్స్
సునీల్ సరైన్ ఆల్ రౌండ్ షో
లక్నో – ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ దుమ్ము రేపింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకు వెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ ను వెనక్కి నెట్టి వేసింది. ఊహించని రీతిలో కేకేఆర్ టీం సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ప్రధానంగా లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన కీలక పోరులో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ప్రధానంగా విండీస్ స్టార్ క్రికెటర్ సునీల్ సరైన్ అటు బ్యాటింగ్ లో మెరిశాడు. అంతే కాదు ఇటు బౌలింగ్ తో కట్టడి చేశాడు. కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా కోల్ కతా బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. లక్నోను పరాజయం పాలు చేశారు.
సునీల్ నరైన్ కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 6 ఫోర్లు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 81 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన లక్నో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. 16.1 ఓవర్లలోనే 137 పరుగులకే చాప చుట్టేసింది. స్టోయినిస్ ఒక్కడే ఆడాడు లక్నో జట్టులో. తను 4 ఫోర్లు 2 సిక్సర్లతో 36 రన్స్ చేశాడు. మిగతా ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు.
ఇక కోల్ కతా బౌలింగ్ పరంగా చూస్తే టాప్ లో ఉంది. హర్షిత్ 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే చక్రవర్తి 30 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఇక 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు రస్సెల్. ఇక నరైన్ 4 ఓవర్లలో 22 రన్స ఇచ్చి ఒక వికెట్ తీశాడు.