చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్
సత్తా చాటిన లక్నో సూపర్ జెయింట్స్
లక్నో – స్వంత వేదిక లక్నో మైదానంలో సత్తా చాటింది కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 144 పరుగులే చేసింది.
వధేరా ఒక్కడే ఆశించిన రీతిలో రాణించాడు. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 46 రన్స్ చేశాడు . ఇదే టాప్ స్కోరర్ కావడం విశేషం. అనంతరం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ సైతం చిన్న స్కోర్ ను దాటేందుకు నానా తంటాలు పడింది. మొత్తంగా ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.
ఆఖరి ఓవర్ వరకు ఈ మ్యాచ్ కొనసాగింది. లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద గెలుపొందింది. ఒకానొక దశలో లక్నో ఓడి పోతుంది అనుకున్న తరుణంలో అడ్డు గోడలా నిలిచాడు స్టోయినిస్. 62 పరుగులతో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఊహించని రీతిలో విజయం సాధించింది లక్నో. ఇక ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ లు ఆడింది. 7 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 3 మ్యాచ్ లలో గెలుపొందింది.