Wednesday, April 23, 2025
HomeSPORTSరాజ‌స్థాన్ అదుర్స్ ల‌క్నో బేవార్స్

రాజ‌స్థాన్ అదుర్స్ ల‌క్నో బేవార్స్

సంజూ .. ధ్రువెల్ షాన్ దార్ షో

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ఐపీఎల్ 2024లో భాగంగా ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరుతో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆక‌ట్టుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది.

ఈ లీగ్ లో రాజ‌స్థాన్ 9 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒక్క‌టి ఓడి పోయి 8 మ్యాచ్ లు గెలుపొందింది. పాయింట్ల ప‌ట్టిక‌లో 16 పాయింట్లు సాధించి టాప్ లో నిలిచింది. ప్లేస్ ఏదైనా విజ‌యం మాత్రం త‌మ‌దేనంటూ చెప్ప‌క‌నే చెబుతోంది..ఆట తీరుతో అదుర్స్ అనిపించేలా ఆడుతోంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

రాయ‌ల్స్ షోతో త‌మ‌దే పై చేయి అంటూ నిరూపించుకుంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ప్ర‌తాపాన్ని చూపించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 196 ర‌న్స్ చేసింది. కేఎల్ రాహుల్ , దూబే జ‌ట్టును గ‌ట్టెక్కించారు. గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేశారు.

అనంత‌రం 197 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన రాజ‌స్థాన్ ప్లేయ‌ర్లు దూకుడు పెంచారు. జోస్ బ‌ట్ల‌ర్ , జైశ్వాల్ దాడి చేశారు. 78 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో అడ్డు గోడ‌లా నిలిచాడు సంజూ శాంస‌న్. త‌న‌కు తోడుగా నిలిచాడు ధ్రువ్ జురైల్.

ఇద్ద‌రూ క‌లిసి వికెట్ కోల్పోకుండా సూప‌ర్ షో ఇన్నింగ్స్ తో దుమ్ము రేపారు. సంజూ శాంస‌న్ కొట్టిన షాట్స్ షాక్ ఇచ్చేలా చేశాయి. 19 ఓవ‌ర్ల‌లో 199 ర‌న్స్ చేసింది. కెప్టెన్ శాంస‌న్ 33 బంతులు ఎదుర్కొని 71 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ధ్రువ్ జురైల్ 34 బాల్స్ ఎదుర్కొని 52 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఇక బ‌ట్ల‌ర్ 34 ర‌న్స్ చేస్తే జైశ్వాల్ 24 ప‌రుగులు చేశాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments