భారీ ఓటమితో కోలుకోలేని దెబ్బ
లక్నో – స్వంత గడ్డపై విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని తపించిన రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ కు చుక్కలు చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. వరుస ఓటములతో తీవ్ర నిరాశ కనబర్చిన ఎస్ ఆర్ హెచ్ చివరకు పోతూ పోతూ లక్నో ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఓపెనర్స్ మార్ష్ 39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 65 రన్స్ చేయగా మార్క్ 38 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. నికోలస్ పూరన్ 26 బంతుల్లో 45 రన్స్ చేయడంతో భారీ స్కోర్ సాధ్యమైంది.
అనంతరం భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ . ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. కేవలం 18.2 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేవలం 4 వికెట్లు కోల్పోయి 206 రన్స్ ను ఛేదించింది. అభిషేక్ శర్మ మరోసారి సత్తా చాటాడు. తను కేవలం 20 బంతుల్లోనే 59 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. క్లాసెన్ 47 పరుగులు చేయగా, కమిందు మెండిస్ 32 రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మొత్తంగా ఈ గెలుపుతో ఊరట లభించింది కావ్య మారన్ కు.