చెలరేగిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్
ఉత్తర ప్రదేశ్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపింది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్న సూపర్ జెయింట్స్ కు చుక్కలు చూపించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. లక్నోకు గతంలో స్కిప్పర్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనతో పాటు పొరెల్ సూపర్ షో చేశాడు. ఢిల్లీ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించారు. లక్నోకు చుక్కలు చూపించారు. వరుసగా ఈ టోర్నీలో ఆరో విజయం దక్కడం విశేషం. పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే క్లోజ్ చేసింది.
కేఎల్ రాహుల్ 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స్ లతో 57 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. తనతో పాటు యంగ్ క్రికెటర్ అభిషేక్ పొరెల్ 36 బాల్స్ ఎదుర్కొని 5 ఫోర్లు ఒక సిక్స్ తో 51 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. మార్క్ 33 బంతుల్లో 52 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ 33 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. లక్నో పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ షోతో విస్తు పోయేలా చేసింది ప్రత్యర్థులను.