దంచి కొట్టిన మిచెల్ మార్ష్ – 33 రన్స్ తేడాతో
గుజరాత్ – ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ కు పోతూ పోతూ లక్నో సూపర్ జెయింట్స్ చుక్కలు చూపించింది. 36 పరుగుల తేడాతో గెలుపొందింది. సూపర్ సెంచరీతో సత్తా చాటాడు మిచెల్ మార్ష్. గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ప్రతీకారం తీర్చుకుంది లక్నో. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 9 వికెట్లు కోల్పోయి 202 రన్స్ మాత్రమే చేసింది.
మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తను 64 బంతులు ఎదుర్కొని 117 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. నికోలస్ పూరన్ కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం మైదానంలోకి దిగిన గుజరాత్ తేలి పోయింది. షారుక్ ఖాన్ 57 , రూథర్ ఫర్డ్ 38 రన్స్ చేశాడు. ఓరూర్కీ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే ఆయుష్ బదోనీ 4 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఆవేష్ ఖాన్ 51 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.