చేజేతులారా మ్యాచ్ కోల్పోయిన రాయల్స్
ఈసారి ఐపీఎల్ టోర్నీ రాజస్థాన్ రాయల్స్ కు కలిసి రాలేనట్టుంది. మొన్న సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన కీలక పోరులో చేతులెత్తేసింది. చేతిలో వికెట్లు ఉన్నా టార్గెట్ ను ఛేదించలేక పోయింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్ , రియాన్ పరాగ్ మెరిసినా ఓటమి నుంచి కాపాడలేక పోయారు. సంజూ శాంసన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. పరాగ్ స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆఖరిలో అవేశ్ ఖాన్ రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. 37 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో లక్నో రాయల్స్ పై 2 రన్స్ తేడాతో గెలుపొందింది.
జైశ్వాల్ 74 రన్స్ చేస్తే , పరాగ్ 39 పరుగులతో ఆడగా అరంగేట్రం కుర్రాడు వైభవ్ 34 రన్స్ తో రాణించారు. మరోసారి ఆఖరులో పరుగులు తీయడంలో తడబడింది. మొదట ఆడిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 180 రన్స్ చేసింది. బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభం నుంచే అదుర్స్ అనిపించేలా ఆడింది. వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు వైభవ్ . అవేశ్ ఖాన్ బౌలింగ్ లో మరో సిక్స్ కొట్టాడు. మార్కరామ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మొత్తంగా టోర్నీ నుంచి రాజస్థాన్ దాదాపు నిష్క్రమించినట్టే.