జగన్ రెడ్డిది విపరీత మనస్తత్వం
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
అమరావతి – ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అత్యంత నిజాయితీ, నిబద్దత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. గత ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వాకంపై , ఆయన పని విధానంపై తనకు కలిగిన అనుభవం గురించి ఓ ఛానల్ తో జరిగిన ముఖా ముఖిలో వెల్లడించారు.
జగన్ మోహన్ రెడ్డి వింత ప్రవర్తనపై విస్తు పోయే నిజాలు చెప్పారు ఎల్వీ సుబ్రమణ్యం. జగన్ రెడ్డిది భయంకరమైన ఆలోచనతో ఉండేవాడని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తొలగించి అక్కడ రాజధాని కట్టాలని తనతో అన్నాడని బాంబు పేల్చారు.
పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ తన ముందుకు తీసుకు వచ్చేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేయ కూడదని తాను చెప్పానంటూ తెలిపారు ఎల్వీ సుబ్రమణ్యం. అయినా జగన్ మోహన్ రెడ్డి వినేవాడు కాదని, జగన్ విపరీత మనస్తత్వం అంటూ కుండ బద్దలు కొట్టారు. ఆయన బాధ తట్టుకోలేక త్వరగా పదవీ విరమణ పొందారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.