చేపలు..గొర్రెల పంపిణీపై విచారణ
ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – గత కేసీఆర్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణకు ఆదేశించింది రేవంత్ రెడ్డి కాంగ్రె్ సర్కార్.
తాజాగా సీఎం సంచలన ప్రకటన చేశారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర పశు సంవర్దక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ, మత్స్య శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి పశు సంవర్దక శాఖపై. కేంద్ర ఆడిటర్ జనరల్ (కాగ్ ) సంచలన ఆరపోణలు చేసింది. పెద్ద ఎత్తున చేపలు, గొర్రెల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా లెక్కలు బయట పెట్టింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో చోటు చేసుకున్న లావా దేవీలపై విజిలెన్స్ , ఎన్ ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంత్రి. స్కీం మొదలైనప్పటి నుంచి నేటి దాకా జరిగిన అన్ని లావాదేవీలపై వివరాలు అందించాలని స్పష్టం చేశారు.